సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోo

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోము

సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన భారాస నాయకులపై చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు
-మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

చిన్నకోడూరు అక్టోబరు 20, అక్షిత న్యూస్ :

సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన భారాస నాయకులపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మీసం మహేందర్ ఆధ్వర్యంలో చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది, ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి సారాధ్యం లో ప్రజలకు శుభీక్షమైన పాలన అందిస్తూ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో యాడాది కాలం పూర్తి కాకముందే 5 గ్యారంటీ లు అమలు చేసి రైతు రుణమాపి కూడా 60 శాతం మంది రైతులకు 2 లక్షల ఋణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానీది సీఎం రేవంత్ రెడ్డిదే అని అన్నారు, అంతే కాకుండా మిగతా 40 శాతం మంది రైతులకు రుణమాఫీ ప్రక్రియ జరుగుతుంటే, రుణమాఫీ 100 శాతం పూర్తిగా అవుతూ ఉంటే ప్రభుత్వంకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని అది ఓర్వలేని భారాస నాయకులు అధికారం కోల్పోయిన నిరాశ, నిస్పృహలో ప్రజలను రెచ్చగొడుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏండ్ల రాక్షసా పాలన లో కనీసం రైతుల మిత్తి పైసలు కూడా మాఫీ చేయని దౌర్బగ్య ప్రభుత్వం మీ భారాస ది అన్నారు. గడిచిన 10 ఏండ్లలో మీ ప్రభుత్వం లో చిన్నకోడూరు మండలం లో భారాస లీడర్లు, హరీష్ రావు అనుచరులు చేసిన అవినీతి ప్రజలు గమనిస్తున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ భారాస అవినీతి నాయకులకు ప్రజలే బుద్ది చెప్పి కాంగ్రెస్ జెండా ఎగురావేయడం కాయమన్నారు, మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చ గొట్టి తప్పు దోవ పట్టిస్తే చూస్తూ ఊరుకోమని మీ భారాస నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమం లో మండల పార్టీ ఉప అధ్యక్షుడు సందబోయిన పర్శరాం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉడుత జయంత్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు చాంద్ పాషా, బీసీ సెల్ మండల ఉప అధ్యక్షుడు జక్కుల నాగరాజు, ఎన్ఎస్ యుఐ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉడుత ప్రశాంత్, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క రాజు, తాళ్లపల్లి రాజు, నాయకులు కొమ్మరాజుల స్వామి, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking