రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల అక్టోబర్ 20 అక్షిత ప్రతినిధి: రైతులు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి మధ్యవర్తి దళారులను నమ్మి మోసపోవద్దని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకట చారి తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే అమ్ముకోవాలని కోరారు, వరి ధాన్య మార్కెట్లలో రైతులకు ఏ సమస్య వచ్చినా డైరెక్టర్ లు, ఐకేపీ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈకార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కామిడి జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.