కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

నూతన రెవెన్యూ చట్టం రాష్ట్ర ప్రజలకు వరం

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పూర్తిగా ఆశాస్త్రీయం

ధరణితో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్లో 50 లక్షల మంది భూ బాధితులే

-తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు ద్వజం

ఖమ్మంలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ వీఆర్వోల పాత్ర అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

ఖమ్మం /అక్షిత బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న ‘నూతన రెవెన్యూ చట్టం భూమాత తోనే రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా 70లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుందనీ, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతోనే పూర్వ వీఆర్వోలకు సముచిత స్థానం దక్కుతుందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు వీఆర్వోలు అరిగోస పడ్డారని గరికె ఉపేంద్ర రావు గుర్తు చేశారు.ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఆశాస్త్రీయంగా తీసుకొచ్చిన మాయదారి ధరణి పోర్టల్ తో రాష్ట్రంలోని 50లక్షల మంది రైతులు బాదితులుగా మారిపోయారని బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ముఖ్యంగా దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో సుమారు 64 రకాల విధులను నిర్వర్తించి ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవంగా బతికిన వీఆర్వోల వ్యవస్థను నాటి సీఎం కేసీఆర్ అహంకార దోరణితో వీఆర్వోల వ్యవస్థను రద్దుచేయడమే కాకుండా రాష్ట్రంలోని 5,139 మంది ఏఆర్వోలకు ఉద్యోగ భద్రతలేక తీవ్ర మానసిక వేదనతో 178 మంది వీఆర్వోలు బలవన్మరణాలు మానసిక రుగ్మతలతో చనిపోయారని ఇవన్నీ గత ప్రభుత్వం తీసుకున్న వీఆర్వోల వ్యవస్థ రద్దు ఫలితమేనని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు అన్నారు.వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టం, 2020 ప్రకారం వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ తత్సమాన పోస్టుల్లో నియమించాల్సి ఉండగా కొన్ని ప్రభుత్వ శాఖలలో శాంక్షన్లు పోస్టులు లేక జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువైన తోటమాలి/వార్డ్ ఆఫీసర్/ రికార్డ్ అసిస్టెంట్ /స్టోర్ కీపర్/కంప్యూటర్ ఆపరేటర్/హాస్టల్ వర్కర్/లైబ్రేరియన్/డ్రైవర్లు / వంట మనిషి/కామటి / స్వీపర్ వంటి పోస్టుల్లో నియమించారని గరికె ఉపేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ, వీఆర్వోల పాత్ర. అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన రెవెన్యూ చట్టం భూమాత తోనే రాష్ట్రంలోని రైతులకు, సమాన్య ప్రజలతో పాటు పూర్త వీఆర్వోలకు సముచిత స్థానం కలుగుతుందన్నారు. అందుకే కొత్త ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల పార్ట్ బీ తో 18లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారని కాస్తు కాలం తొలగించడంతో మరో 9 లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారనీ మొత్తం మీద రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతుల్లో ఏకంగా 50లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారని గరికె ఉపేంద్రరావు విమర్శించారు.

*కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు*

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న భూమాత చట్టంతో గ్రామ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించుకునేలా వెసులుబాటు కల్పించడానికి వీలుగా చట్టం రూపొందించడం గొప్ప వరమని గరికె ఉపేంద్ర రావు అన్నారు. మండల డివిజన్ జిల్లా స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేసేలా రూపకల్పన చేయడం శుభ పరిణామమని అన్నారు. సమస్త రైతుల భూముల పరిరక్షణ ప్రభుత్వ భూముల పరిరక్షణ, కట్టుదిట్టమైన చర్యలకు భూమాత చట్టంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ పరమైన విధులు నిర్వర్తించడానికి ఒక అధికారిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షించదగిన విషయమన్నారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక సహాయకుడు 10,954 రెవెన్యూ గ్రామాలుగా సుమారు 16 వేల క్లస్టర్లలో ప్రతీ క్లస్టర్కు ఒక ఉద్యోగిని నియమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారధ్యంలో తీసుకొస్తున్న భూమాత చట్టం రెవెన్యూ వ్యవస్థలోనే ఒక సంచలన నిర్ణయమని ఈ చట్టం కోసం యావత్ రాష్ట్ర ప్రజలు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ పాలన తీరుతో రాష్ట్రంలో చనిపోయిన 178 మంది వీఆర్వోల కుటుంబాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ సర్కారు మేలు మరువమని గరికె ఉపేంద్రరావు అన్నారు.

*వీఆర్వోల పాలిట శాపంలా మారిన గత బీఆర్ఎస్ పాలన*

గత బీఆర్ఎస్ పదేండ్ల పాలన పూర్తిగా రైతులు వీఆర్వోల పాలిట ఓ పీడ కలలా శాపంలా మారిపోయిందని గరికి ఉపేంద్ర రావు అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నాడు ఉన్న 5,139 మంది వీఆర్వోలను జీఓఎంఎస్ నెంబర్ 29 ద్వారా 19 సెప్టెంబర్ 2020 ద్వారా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెండేండ్ల పాటు వీఆర్వోలకు ఎలాంటి జాబ్ చార్ట్ లేకుండా పెట్టిదాకీరికి మానసిక వేధనకు గురిచేసిన కేసీఆర్ ప్రభుత్వం రైతులు, వీఆర్వోల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోయిందన్నారు. జీఓఎంఎస్ నెంబర్ 121 తేదీ 23 జులై 2022న రీడిప్లాయిమెంట్ చేస్తూ అర్ధరాత్రి వేళ కలెక్టర్ కార్యాలయాల్లో లాటరీ పద్ధతిన వీఆర్వోలను అందరినీ అమానవీయంగా నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల హక్కులు విస్మరించి వివిద అటానమస్ బాడీల్లోకి నెట్టివేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఫలితంగా జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువైన తోటమాలి/ వార్డ్ ఆఫీసర్/ రికార్డ్ అసిస్టెంట్ /స్టోర్ కీపర్/కంప్యూటర్ ఆపరేటర్/హాస్టల్ వర్కర్/లైబ్రేరియన్/డ్రైవర్లు / వంట మనిషి/ కామటి / స్వీపర్ వంటి పోస్టుల్లో నియమించారని గరిక ఉపేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దు ఫలితంగా పీ ప్రొటెక్షన్ సర్వీస్ ప్రొటెక్షన్ కోల్పోయారని అన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ భూములు ఆస్తుల పరిరక్షకులుగా సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక ఎన్నికల విదులు ప్రొటోకాల్ ప్రొటోకాల్ ప్రకృతి విపత్తుల సమయంలో శాస్త్రీయమైన అంచనాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో పాటు వారికి సంబంధంలేని శాఖలో విధులు నిర్వర్తించాల్సి రావడంతో పాటు ఆయా పని ప్రదేశాల్లో అనేక రకాల వివక్షలకు గురయ్యారని గరికి ఉపేంద్రరావు అన్నారు. వీఆర్వోలను లంచగొండులుగా అవినీతి పరులుగా కేసీఆర్ ప్రభుత్వం చిత్రీకరించి మానసిక హింసకు గురిచేసిందన్నారు. ఫలితంగానే రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో 178 మంది వీఆర్వోలు ఆకాల మరణం చెందరనీ అయినా వారికి కారుణ్య నియామకాలు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో చనిపోయిన 178 మంది వీఆర్వోల కుటుంబాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ సర్కారు మేలు మరువలేమని ఉపేంద్ర రావు అన్నారు.నూతనంగా రూపుదిద్దుకుని అమలుకు సిద్ధంగా ఉన్న భూమాత తోనే రైతులకు రెవెన్యూ వ్యవస్థకు బలోపేతం అని గరికె ఉపేంద్ర రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రతీ రెవెన్యూ క్లస్టర్కు ఉద్యోగిని నియమిస్తామని చెప్పడం పూర్వ వీఆర్వోలకు గొప్ప వరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు చర్యలతో బాధితులుగా మారిన రాష్ట్రంలోని 5,139 మంది పూర్వ వీఆర్వోలకు మళ్లీ కొత్త చట్టం ద్వారా స్థానం కల్పించి మా సేవలను వినియోగించుకోవాలని గౌరవ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గరికె ఉపేంద్రరావు వేడుకున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న భూమాత చట్టం కోసం అహర్నిశలు పనిచేసి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని గరికె ఉపేంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.ధరణి పోర్టల్ యావత్ రెవెన్యూ వ్యవస్థ వీఆర్వోలు రైతుల పాలిట ఓ పీడ కల అని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు విమర్శించారు.ధరణి పోర్టల్ వల్ల తమ భూములు కోల్పోయిన రైతుల ఆగ్రహంతో కుత్బుల్లాపూర్ మెట్లో తహసీల్దార్ పనిచేసిన విజయరెడ్డి దారుణ హత్యకు గురయ్యారనీ నిజామాబాద్లో మరో తహసీల్దార్ మానసిక వేదనతో బలవన్మరణాకి పాల్పడ్డారని అన్నారు. కొత్తగూడెం జిల్లాలో 17 మంది వీఆర్వోలను జీసీసీలో విధులు కేటాయించడంతో వారు పెట్రోల్ పంప్ ఆపరేటర్లుగా రేషన్ డీలర్లుగా బతుకీడుస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి భూమాత చట్టం సమూలంగా మార్గం చూపనుందనీ, పల్లెల్లో మళ్లీ మంచి వాతావరణం నెలకొనే వీలుందని గరిక ఉపేంద్రరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సున్నం రామరావు ప్రసాద్ వి రామారావు జిల్లా నాయకులు స్వామి దాస్ నాగేంద్రబాబు ఎస్ కె సుభాని లక్ష్మీ నర్సు కృష్ణ యల్లమంద వరలక్ష్మి, విజయలక్ష్మి వెంకటరమణ మేడికొండ బాలయ్య, బండ కృష్ణయ్య చర్ల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking