పోలీస్ ల న్యాయమైన కోరికలు తీర్చాలి
వాళ్ళను వేధించవద్దు
మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పోలీస్ కుటుంబాల న్యాయమైన కోరికలను పోలీస్ ఉన్నతాది కారులు ప్రభుత్వంతో చర్చిoచాలి.
ఆందోళన చేస్తున్న పోలీస్ కుటుంబాలను వే ధించవద్దు.ఆ పోలీస్ లను ఉద్యోగాలనుంచి తొలగిoచ వద్దు.తెలంగాణ ప్రత్యేక పోలీస్ బలగాల కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళన న్యాయమైంది.పౌర సమాజం వాళ్లకు మద్ధతు ఇవ్వాలి.పోలీస్ ల హక్కులకై వాళ్లకు వాళ్ళు పోరాడే పరిస్థితి లేదు కాబట్టి ఆ కుటుంబసభ్యులు చేస్తున్న పోరాటానికి ప్రజలుగా మనం మద్ధతు ఇవ్వాలి.పోలీస్ లు మిగతా ఉద్యోగుళ్లాగానే అన్ని హక్కులు వున్నవాళ్లే. వాళ్లకు హక్కుల తో పాటు బాధ్యతలు వున్నాయి. పోలీస్ ల రాజకీయ నాయకుల మాటలు విని ఎక్కువ సందర్భల్లో ప్రజా కంటకులుగా మారుతున్నారు. లాకప్ డెత్ లు, తప్ప్పుడు కేసులు, నిర్లక్ష్యం, ఆక్రమణ దారులుకు, దూర్మార్గులకు రక్షణ కల్పించడo విచారణ పేరుతో హింసి oచడం, ఉద్యమాలను ప్రజాపోరాటాలను అణిచివేయడానికి లాఠీ ఛార్జ్ నుంచి అనేక అప్రజాస్వామిక విధానాలు బూటకపు ఎదురుకాల్పుల వరకు అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టి అధికార పక్షానికి వత్తాసు పలకడం వరకు అనేక చెడ్డపనులు చేస్తూ ప్రజలకు దూరం అయ్యారు. అధికారంలో వున్నప్పుడు వాళ్ళను వాడుకుని ప్రతిపక్షంలోకి రాగానే పోలీస్ లను దూర్మార్గులుగా ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడం పరిపాటి. అధికార పక్షంలోను వైరి వర్గాలు పోలీస్ లపై పిర్యాదులు చేయడం సర్వసధారణo పోలీసులు ఇవ్వన్నీ అర్ధం చేసుకుని చట్టప్రకారం నడుచుకోవాలని, అధికార పక్షం మాటలు విని అన్యాయాలకు పాల్పడకవద్దని , అలా పాల్పడ్డ వాళ్లకు ఏ పరిస్థితులు వస్తున్నాయో గమనించి పోలీస్ లు మారాలని అంతిమoగా ప్రజల న్యాయమైన పిర్యాదులకు గౌరవం ఇవ్వాలని చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకుంటూ ప్రత్యేక పోలీస్ విభాగాల పోలీస్ కుటుంబాలు చేస్తున్న పోరాటాలను అర్ధం చేసుకుని పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ల న్యాయమైన కోరికలను నెరవేర్చాలి అని కోరుతున్నాం.రోజుకు ఎనిమిది గంటలు పనిచేయించాలి. నెలకు నాలుగు రోజులు సెలవు దినాలు ఇతర సెలవులు కేటాయించాలి.
రాష్టoలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలి.