నీ అంతు చూస్తా… వార్త రాస్తావా…

నీ అంతు చూస్తా
వార్త రాస్తావా

దుండిగల్ లో కల్లు కాంపౌండ్ పై వార్తలు రాసిన జర్నలిస్టుకు బెదిరింపులు

కుత్బుల్లాపూర్ మన తెలంగాణ ఇన్చార్జికి ఫోన్ చేసి బూత్ పురాణం చేసినందుకు కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై కేసు నమోదు

మున్సిపాలిటీ స్థలంలో కల్లు కాంపౌండ్ ఏర్పాటుపై వార్త రాస్తే విలేఖరికి బెదిరింపులు..

మేడ్చల్ డిసిపిని కలిసిన జర్నలిస్టు సంఘం నాయకులు..

విలేకరి ఫిర్యాదు మేరకు కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై కేసు నమోదు…దుండిగల్ పోలీసులు..

కల్లు కాంపౌండ్ స్థలంలో మున్సిపల్ బోర్డు నాటిన మున్సిపల్ అధికారులు..

మేడ్చల్, అక్షిత బ్యూరో :
మాపై వార్త రాస్తావా…నీ అంతు చూస్తా… తమాషాగా ఉందా… నా గురించి మీకు తెల్వదు… నువ్వు వస్తావా… నన్ను రమ్మoటవా… అంటూ పరుష పదజాలంతో ఓ జర్నలిస్టును దుర్భాషలాడిన సంఘటన చోటు చేసుకుంది.మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి కల్లు కాంపౌండ్ దర్జాగా చేపడుతూ కాసులు దండుకుంటున్న తీరును ఎండగట్టిన జర్నలిస్ట్ ను బెదిరించిన తీరు. వివరాల్లోకి వెళితే… దుండిగల్ పురపాలక పరిధి దుండిగల్ విలేజి స్థలంలో కల్లు కాంపౌండ్ ఏర్పాటుపై వార్తలు రాస్తే జర్నలిస్టును బెదిరించిన కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్లో మున్సిపాలిటీ స్థలంలో వ్యాపారస్తులు కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారు. అంటూ ఈ నెల 22వ తేదీన…మన తెలంగాణలో దుండిగల్ మున్సిపాలిటీలో ఘరానా దోపిడీ..అనే శీర్షిక ప్రచురితమైంది.

ఈ కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు కల్లు కాంపౌండ్ వద్ద మున్సిపల్ స్థలం అంటూ దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు కల్లు కాంపౌండ్ పై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ సమాచారం అందుకున్న కల్లు కాంపౌండ్ నిర్వాహకులు దుండిగల్ వాస్తవ్యులు లద్ధిపీర్ల బిక్షపతి గౌడ్, ఆయన సోదరుడు లధిపీర్ల నర్సింగ్ రావు గౌడ్ లు వార్త రాసినందుకు వర్కింగ్ జర్నలిస్ట్ కు బుధవారం ఫోన్ చేశారు. కల్లు కాంపౌండ్ పై వార్త ఎందుకు రాశావు అంటూ ఫోన్లో దౌర్జన్యం ప్రదర్శిస్తూ మేం చూపించినవి కూడా రాస్తావా?? ఇక్కడికి రా ! దమ్ముంటే వచ్చి మేం చెప్పినవి కూడా రాయి, చాలా కబ్జాలు జరుగుతున్నాయి… రా రా అంటూ బూతు పురాణం మొదలుపెట్టారు. నువ్వు ఇక్కడికి వస్తావా ! లేక మమ్మల్ని రమ్మంటావా!! అంటూ మన తెలంగాణ విలేకరిని చెడు పదుజాలంతో దూషిస్తూ, నీ అంతు చూస్తాం అంటూ కల్లు కాంపౌండ్ నిర్వాహకులు రెచ్చిపోయారు.

ఈ ఘటనపై కుత్బుల్లాపూర్ జర్నలిస్ట్ సంఘం స్పందించి సమాజ శ్రేయస్సుకు కోసం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వార్తలు రాస్తే జర్నలిస్టును ఇలా అదిరించి… బెదిరించడంపై మండిపడ్డారు. జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ డిసిపి కోటిరెడ్డిని కలిసి జర్నలిస్టులపై బెదిరింపులను అరికట్టాలని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సోదరులు డిసిపి కోటిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన డిసిపి కోటిరెడ్డి జర్నలిస్టును బెదిరించిన ఆడియోనను విని వెంటనే స్పందించారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ డివిజన్ ఏసిపి, దుండిగల్ సీఐ సతీష్ లను ఆదేశించారు. బాధిత జర్నలిస్ట్ కే రాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన దుండిగల్ పోలీసులు బెదిరింపులకు పాల్పడిన కల్లు కాంపౌండ్ నిర్వాహకులు ఎల్ బిక్షపతి గౌడ్, ఎల్ నర్సింగరావు గౌడ్ లపై క్రైమ్ నెంబర్ 879/2024 పై బి.ఎన్.ఎస్ ఆక్ట్ ప్రకారం సెక్షన్ 351 (2) 352 ల కింద కేసు నమోదు చేసినట్లు దుండిగల్ సీఐ సతీష్ తెలిపారు. సమాజంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని చట్టం తన పని తన చేసుకుపోతుందని సిఐ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking