భూ కబ్జాకు పాల్పడలే

భూ కబ్జాకు పాల్పడలే

కావాలనే నిందలు

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి

వేములపల్లి, అక్షిత న్యూస్:

మా కుటుంబంపై ఈర్ష ద్వేషంతో కొంతమంది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భూమిని కబ్జా చేశారంటూ ఆరోపణలు చేయడంలో నిజం లేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు నేను ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించానని ఆరోపణలు చేస్తూనన్నురాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీయాలని ఆడిస్తున్న నాటకంలో భాగమన్నారు. ఈ భూమిని హక్కుదారులైనకాంతమ్మ, మాలి జగన్ రెడ్డి,యాదగిరి రెడ్డి, పాండురంగారెడ్డి,శేఖర్ రెడ్డిలకు సర్వే నెం 84 లో ఉన్నటువంటి2ఎకరాల23గుంటలు భూమిని కొనుగోలుచేయటం జరిగిందన్నారు.నేను కొనుగోలు చేసిన భూమి కంటే ఒక్క సెంటు భూమి ఎక్కువ వాడుకున్న నాపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని దానికి నేను కట్టుబడి ఉంటాననన్నారు.భూమి కొనుగోలు చేసే సమయంలో నాకు స్థలాన్ని అమ్మిన వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలకు 2 గుంటల స్థలాన్ని దానం చేశారని అది కాకుండా నేను కొనుగోలు చేసిన దానిలో మిగులు స్థలం ఉన్నదని ప్రజలను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. దీనిపై గతంలోనే స్థానిక పెద్ద మనుషులు రెవిన్యూ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు పెట్టినప్పటికీ ఇలాంటి నిందలు వేయడం సరికాదన్నారు.కొంతమంది వ్యక్తులు నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నిరాధారణ ఆరోపణలు చేస్తూ నన్ను బలి పశువును చేయాలనీ చూస్తున్నారని నేను తప్పు చేసి ఉంటే రాజకీయంగా,వ్యక్తిగతంగా, ఏ శిక్షనైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking