3న బీసీ సింహగర్జన మహాసభ

బీసీ సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలి

మాజీ సర్పంచ్ నాగవెళ్ళి మధు

వేములపల్లి, అక్షిత న్యూస్ :

నవంబర్ 3న మిర్యాలగూడలో నిర్వహించనున్న బిసి సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు, వేములపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నాగవెళ్లి మధు కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ జనాభాలో 65 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యా ధికారంకావాలని, బీసీగణనను సత్వరమే చేపట్టి జనాభా ప్రతి పాదికన బీసీలకు విద్య ఉపాధి రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పించాలన్నారు. బీసీల ఐక్యత, హక్కుల సాధన కోసం నవంబర్ మూడున మిర్యాలగూడలో జరిగే భారీ బహిరంగసభకు బీసీలందరు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking