*అనంతగిరి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక*
అనంతగిరి, అక్షిత న్యూస్ :
అనంతగిరి మండల కేంద్రంలో అనంతగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా గరిడేపల్లి మురళి, బానోతు సతీష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తామని జర్నలిస్టుల అభివృద్ధికి ఎల్లవేళలా తోడ్పడతానని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నకరికంటి కరుణాకర్, మట్టపల్లి ఉపేందర్, గౌరవ సలహాదారులు నూకపొంగు ఈదయ్య, తునం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పల్లా బాలు, గరిడేపల్లి రాము, సహాయ కార్యదర్శిలు కొత్తపల్లి ఉపేందర్, అల్లు చలం కోశాధికారి మాతంగి వినయ్ కార్యవర్గ సభ్యులు సాయి తేజ రవిచంద్ర మణికంఠ శ్రీరామ్ గోపి తదితరులు పాల్గొన్నారు.