మూసీ ప్రక్షాళనకు అడ్డుపడొద్దు

మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే

భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్న్తార్ధకం..

అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి

ఎంపీ చామల..మూసీ పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం..
శాలిగౌరారం అక్టోబర్ 27 అక్షిత న్యూస్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టతంకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనను బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రాజకీయ కుట్ర తో అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయతాన్ని విరమించుకొని భావి తరాల మనుగడ కోసం ఆత్మ విమర్శణ చేసుకొని ప్రక్షాళనకు మద్దతుగా ఉండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి మూసీ పరివాహక ప్రాంతాల రైతుల ఆత్మీయ సమ్మేళనం అడ్డగూడూరు మండలం మానాయికుంట, శాలిగౌరారం మండలం గురజాల మూసీ నది బ్రిడ్జి మీద ఆదివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమ్మేళనంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మూసీ నది సుందరీకరణ కాదని మూసీ నది పునర్జవనం కోసమని, మూసీ మురికి నుంచి ప్రజలను విముక్తి చేయడానికి ప్రభ్యత్వం చేస్తున్న భగీరథ ప్రయత్నమన్నారు. ప్రపంచ వ్యాప్తతంగా గుర్తేండే విధంగా ఒక ఆధునిక నగరంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దుతుంటే దరిద్రపు ఆలోచనలతో బిఆర్ ఎస్, బి జె పి పార్టీలు విష ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. మూసీ ప్రక్షాళనకు అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. సోషల్ మీడియాలో చిల్లర ప్రసంగాలు,  ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రం లో ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నరన్నారు. దీపావళి తర్వాత నకిరేకల్ లో చివరగా ఇబ్రహీం పట్నం లో లక్ష మంది తో మూసీ పరివాహక ప్రాంత రైతుల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరు మూసీ ప్రక్షాలనకు మద్దతు నిలవాలని కోరారు. ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్నాదన్నారు. మూసీని ప్రక్షాళన చేయడం ఈ ప్రాంత రైతుల అదృష్టమన్నారు. ముసీ ప్రక్షాలనకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపలన్నారు. ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన కై 16 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూయించి మూసి ప్రాంత ప్రజలను మోసం చేసి ఇప్పుడు ప్రక్షాళన అడ్డుకోవడం విడ్డురంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూక కిరణ్ కుమార్,కాసోజు శంకరమ్మ, అన్నెపర్తి జ్ఞాన సుందర్, మండల పార్టీ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య, కందాల సమరం రెడ్డి, వంగాల సత్యనారాయణ, అడ్వాకెట్ యుగేందర్, అన్నెబోయిన సుధాకర్,పాదూరి శంకర్ రెడ్డి చిరంజీవి, దండ అశోక్ రెడ్డి, జనార్దన్,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking