చంద్వాడ్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి సీత‌క్క ప్ర‌చారం*

*చంద్వాడ్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి సీత‌క్క ప్ర‌చారం*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాగంగా నాసిక్ జిల్లాలోని చంద్వాడ్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ మంత్రి, సీనియ‌ర్ అబ్సర్వ‌ర్ సీత‌క్క ప‌ర్య‌టించారు. కాంగ్రెస్ అభ్యర్ధి శిరీష్ కొత్వాల్ తో క‌లిసి ద్రాక్ష‌, ఉల్లి రైతుల‌తో మంత్రి సీత‌క్క భేటి అయ్యారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. వ‌ర్షాల వ‌ల్ల ద్రాక్ష‌, ఉల్లి పంటలను న‌ష్ట‌పోయినా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ‌ను ఆదుకోలేద‌ని స్థానిక రైతులు వాపోయారు. గిట్టుబాటు ధ‌ర అంద‌క‌పోవ‌డం వ‌ల్ల న‌ష్ట‌పోతున్నామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతు..రైతు వ్య‌తిరేక బీజేపీ – షిండే ప్ర‌భుత్వాన్ని ఓడించాల‌ని పిలుపునిచ్చారు.

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌లేని ప్ర‌భుత్వానికి బుద్ది చెప్పాల‌ని కోరారు. నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే కాంగ్రెస్ అభ్యర్ధి శిరీష్ కొత్వాల్ ను గెలిపించాల‌ని విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking