కష్టపడితే సక్సెస్ తధ్యం

కష్టపడితే సక్సెస్ తధ్యం

కొత్త ప్రాజెక్టులతో పయనం

అంబరాన్నంటిన
రాజు బర్త్ డే సంబరాలు

రాజా ఇన్ ఫ్రా సీఎండి ఎస్ఎస్ రాజు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఎంతటి కష్టమైనా ఇష్టంగా పనిచేస్తే సక్సెస్ మన సొంతమని రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు అన్నారు. బర్త్ డేను పురస్కరించుకుని రాజా ఇన్ ఫ్రా స్టాఫ్ ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై ప్రసంగించారు. కష్టపడి పని చేసి విజయానందంతో కుటుంబాలను హాయిగా గడపాలని ఆకాంక్షించారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా టైం, టాలెంట్ ను కేటాయిస్తే ఉజ్వల భవిష్యత్తు ను పొందుకోగలరని యువతకు హిత బోధ చేశారు.

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా రియల్ రంగంలో ప్రవేశించిన తను ఇంతింతై వటుడింతై అన్న చందంగా రియల్ బిజినెస్ లో ఇంతటి స్థితికి చేరుకున్నానని, తన జీవితం యువతకు ఆదర్శ ప్రాయమన్నారు. ఉద్యోగాల అన్వేషణకు బదులుగా రియల్ ఎస్టేట్ రంగంలో మీకున్న సమయంలో కొంత కేటాయించి స్వతహాగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులను ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్
చైర్మన్ యం.దాస్ మాట్లాడుతూ అన్ని వ్యాపారాల్లో కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభసాటిగా ఉంటుందన్నారు. ప్రసుత పరిస్థితిల్లో బోర్డు తిప్పేసే కంపెనీలు బోలెడన్ని ఉన్నాయని, పారదర్శకత కల్గిన కంపెనీని ఎంచుకుని బిజినెస్ చేయాలన్నారు. ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడికి భద్రత… భవిత ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయా కంపెనీల స్థిరత్వం.. పేరెన్నికను పరిగణలోకి తీసుకుని ఆయా సంస్థల్లో చేరి ఉజ్వల భవిష్యత్తు పొందుకోవాలని ఆయన కోరారు.

రాజా ఇన్ ఫ్రా సంస్థ వేలాది మంది ఇన్వెస్టర్ల భవితకు బాటలు వేసిందని, యువతకు ఉపాధిని కల్గించిందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు మరిన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. చైర్మన్ హోదా అటుంచి స్టాఫ్, మార్కెటింగ్ సిబ్బందితో మమేకమై కలివిడిగా ఉంటూ బిజినెస్ మెలుకువలు అందిస్తూ ఎస్ఎస్ రాజు మెంటార్ గా ముందుకు వెళ్లడం అభినందనీ యమన్నారు. మంచి ఆయుష్షుతో ఇంకా ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే… ఇన్వెస్టర్ల భవితకు బంగారు బాటలు వేయాలన్నారు. తొలుత రాజు కార్యాలయంలోకి అడుగిడిన వెంటనే పూల వనంతో ఘన స్వాగతం పలికి బొకేలను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి రజిని, ఐలయ్య, నవీన్, సతీష్, స్నేహ, నీరజ, లహరి, నిషిత, ఐశ్వర్య, కాజల్, ఉదయేశ్వరి, ప్రశాంతి, మనోజ్, ద రూపీ కంపెనీ చైర్మన్ గణేష్ అట్లూరి, తెలుగు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రొడ్యూసర్ కుమార్ కశెట్టి, చిత్ర పరిశ్రమ డైరెక్టర్ సతీష్ కుమార్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking