ఈ-వేస్ట్ …రీసైక్లింగ్
యూనిట్లు అవసరం
నిమ్స్ అసోసియేట్
ఫ్యాకల్టీ కోటేశ్వరరావు
మేడ్చల్, అక్షిత బ్యూరో :
ఈ-వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లు అవసరమని నిమ్స్ మి అసోసియేట్ ఫ్యాకల్టీ కే.కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్ లో ఈ వేస్ట్ మేనేజ్ మెంట్ రీసైక్లింగ్ ఎంపికలు అంశంపై ఈనెల 25 నుంచి 29 వరకు నిర్వహణ అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని హైలెట్ చేస్తూ 53.6 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి చేసిందని, ఆసియా ఖండంలో 24.9 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగా, అందులో ప్రధాన భూమిక పాత్రగా భారత్ పోషించిందన్నారు. 3.2 మెట్రిక్ టన్నుల చైనా, అమెరికా తదుపరి తలసరి ఉత్పత్తిలో మూడవ అతిపెద్ద ఈ వ్యర్థ ఉత్పత్తిదారుగా రికార్డు కెక్కిందన్నారు. భారతదేశంలో ఈ వ్యర్థాలలో 90 శాతం అసంఘటిత రంగం ద్వారా నిర్వహించ బడుతుందని, ఈ వ్యర్థాలను నిలకడగా ఎలా నిర్వహించాలో అర్ధం చేసుకోవడం, చర్య తీసుకోవడం అత్యంత అవశ్యమన్నారు. ఈ వ్యర్థాల ఉత్పత్తి, సేకరణ, పారవేయ డంపై ఖచ్చితమైన డేటా ఒక దేశం వ్యర్థాల నిర్వహణ, విధానాలు, పద్దతులను రూపొందించుకుని అభివృద్ధి చేస్తుందన్నారు. సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ప్రోగాం కో-ఆర్డినేటర్ డాక్టర్ ఐ.వరలక్ష్మి, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ ఎం. శర్వణన్ లు స్వాగతం పలికిన పిదప జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ డేటాను సేకరించి విశ్లేషించడానికి తగిన యంత్రాంగాలు ఉండాలన్నారు. ఈ వ్యర్థాల ఉత్పత్తి, ప్రవాహాలు, రిటైలర్లు, సేకరణ నెట్వర్క్ లు చేతులు కలపడంతో ఈ వ్యర్థాల వికేంద్రీకృత సమాజ ఆధారిత నిర్వహణను స్వీకరించవచ్చన్నారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వద్దతులను సులభంగా అమలు చేయడానికి వాటాదారుల కోసం డీమిస్టిఫైడ్ రోల్, రెసిపీ అవసరమన్నారు. అనంతరం ప్రోగ్రాం టెక్నికల్ సెషన్స్ జరిగాయి. ఎంఎస్ఎంఇ, డిసి ఎంఎస్ఎంఇ,ఈఎస్ డిపి పథకం కింద స్పాన్సర్స్ చేసిన సుమారు 25 మంది ఎంబీఏ విద్యార్థిని, విద్యార్థులు భాగస్వాములయ్యారు. తదుపరి ఆయా అంశాల పట్ల విధ్యార్థుల అనుభవాలను వంచుకున్నారు. తమ కలల సాకారానికి ఎలా అభ్యసించి అమలుచేస్తారో వివరించారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లను స్థాపించి వర్ణమాన, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వ్యాపార అవకాశాలను అందించాలని సూచించారు. నిమ్స్ మి ఫ్యాకల్టీ వి.స్వప్న తదితరులు పాల్గొన్నారు.