మలి దశ తొలి పోలీస్ అమరుడుకి ఘన నివాళులు
●జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నెబొయిన సుధాకర్
నల్గొండ, అక్షిత బ్యూరో :
శాలిగౌరారం మండల కేంద్రంలో మలి దశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన తొలి పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నేబోయిన సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకంగా మలి దశ ఉద్యమం జరుగుతున్న తరుణంలో స్వరాష్ట్రం సాధించాలని ఆకాంక్షిస్తూ తన కుటుంబ సభ్యులను వదిలి రాష్ట్రం కొరకు ఆమరుడైన కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతి లో భాగంగా వారికి నివాళులర్పించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో పడాల యాదగిరి,గుడిసె శీను,అన్నేబోయిన అనిల్,పడాల రమేష్,గంధసిరి హరి,నాగరాజు, గుండబోయిన పవన్, బండారి లక్ష్మయ్య, నిద్ర వీరయ్య, అంకిరెడ్డి, రాజేష్ ముదిరాజు, తదితరులు పాల్గొన్నారు