మెరుగైన వైద్య సేవలందించాలి
– నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.భువనగిరి మెయిన్ రోడ్డు సీసీ బ్యాంకు ప్రక్కన కళ్లెం సైదులు,సాపిడి రాంప్రసాద్ లు ఏర్పాటు చేసిన గురు ఆస్పటల్,భవాని మెడికల్ హాల్ ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు పేదలకు గొప్ప కానుక అయిందన్నారు.ఆరోగ్యశ్రీ వైద్య సేవల ఖర్చులు రూ.5 లక్షల నుండి పది లక్షలకు పెంచడం వల్ల పేదలకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కోట్యా నాయక్, కాంగ్రెస్ నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి,జినుకల ప్రభాకర్,గుత్త నర్సింహరెడ్డి,కునూరు సాయి కుమార్,గాదె శోభారాణి,మడూరి జ్యోతి,గోదాసు పృథ్విరాజ్,బత్తుల కృష్ణ,ఎండి అక్రమ్,మోటే రమేష్,ఎండి నాసర్,ఎండి జమీరొద్దిన్,కడమంచి సంధ్య స్వామి,నోముల ప్రవీణ్,మేకల మల్లేష్,డోగిపర్తి సుభాష్,నాగులంచ నగేష్,పావిరాల నాగరాజు,దూదిమెట్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.