సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
– నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.మండల కేంద్రానికి చెందిన బి.ఉమామహేశ్వరి, జి.నరసింహలు ఇటీవల అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది, సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకటరాజారెడ్డి, జినుకల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీరోద్దీన్, నాయకులు ఎండి అక్రమ్,కోట సుధాకర్,గొలుసుల ప్రసాద్,కొమ్ము శేఖర్,గురుకు శివ,మోటే రమేష్ తదితరులు ఉన్నారు.