కొమురవెల్లిలో చైన్ స్నాచింగ్
కొమురవెల్లి అక్షిత న్యూస్:
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ నందు చైన్ స్నాచింగ్ కేసు నమోదు చేయబడినది వివరాలు ఏమనగా కొమురవెల్లి గ్రామానికి చెందిన దేశెట్టి తిరుపతమ్మ గారి ఇంటిలో ఎల్లమ్మ పండుగ జరుపగా వారి బంధువులు అగు మద్దూరు మండల్ ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు గణేష్ కుటుంబ సభ్యులతో కొమరవెల్లి గ్రామానికి రావడం జరిగింది పండుగ అనంతరం భోజనం చేసి రాత్రి నిద్రిస్తున్న మూడు గంటల సమయంలో గణేష్ భార్య అగు పల్లపు అనిత మెడలో గల సుమారు మూడు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పోయాడని ఫిర్యాదు రాగా కొమరవెల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగినది అని కొమురవెల్లి ఎస్ఐ రాజు, తెలిపినారు.