సాంకేతికత రైతులకు ఉపయుక్తమవ్వాలి
సూర్యతేజ పార్ బాయిల్డ్ కు
రూ.4 కోట్లతో అత్యాధునిక సైలోలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నూతన టెక్నాలజీతో రైస్ మిల్లర్లకు, రైతుకు లాభం జరిగేలా ఉండాలని అందరూ బాగుండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్ది అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం బాదలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని సూర్యతేజ పార్ బాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లులు నూతన టెక్నాలజీ సుమారు రూ.4 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ధాన్యం నిల్వ సైలోలను ఆయన ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సైలో ఏర్పాటు చేయడం మిల్లర్ కొనుగోలు సామర్థ్యం పెరిగే అవకాశం, కొనుగోలు చేసిన ధాన్యం చెడిపోకుండా ఉండే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో మిల్లుల ముందు ట్రాక్టర్లు బారులు తీరే సమస్య ఉండదని ఆయన తెలిపారు.

ఒక్కో సైలో 50,000 బస్తాల ధాన్యం నిల్వ సామర్థ్యం కలిగి ఉండటం మిల్లర్లకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో పౌరసరఫరాల సంస్థ గాడి తప్పిందని సంస్థ 58,000 కోట్ల రూపాయల నష్టంలో ఉంటే 11,000 కోట్ల రూపాయల వరకు పూడ్చ గలిగామన్నారు. నిర్లక్ష్య పాలనవల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడొద్దన్నారు. వానాకాలం సీజన్ లో ఏ రాష్ట్రంలో పండని విధంగా 47లక్షల రైతులు 66.07 లక్షల ఎకరాల్లో వరి 153 లక్షల మెట్రిక్ టన్నులు పండిందని ఆయన తెలిపారు.

కొనుగోలు చేసిన్ ధాన్యానికి 35,000 కోట్ల నుండి40,000 కోట్ల రూపాయల మేర చెల్లించమని తెలిపారు. ఎస్ఎల్బిసి సొరంగ పనులు, డిండి ప్రాజెక్టు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 5 లిఫ్టులు పూర్తి చేస్తామని, రహదారుల పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అని కంచు కోటగానే ఉందన్నారు. వచ్చే నాలుగేళ్లలో మరింత ప్రగతి చూపుతామన్నారు. ఐకేపి కొనుగోలు కేంద్రాలలో తొలుత కొనుగోలులో కొంత ఇబ్బంది రైతు నుండి దొడ్డ, సన్న రకాలు కొనుగోలు చేశామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు, మిల్లర్లను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా నల్లగొండ జిల్లాలు పోటీ పడి రికార్డు స్థాయిలో పండించారని. రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్ జయిని ప్రకాష్ రావు, జైని మురళీ, పార్టనర్స్ పైడిమర్రి రంగనాథ్, పైడిమర్రి సురేష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంప నాగేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రేపాల మధుసూదన్, మిర్యాల మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి, మిల్లర్స్ ఉపాధ్యక్షులు గంటా సంతోష్ రెడ్డి, బండారు కుశలయ్య, గుడిపాటి నవీన్, మంచుకొండ వెంకటేశ్వర్లు, రాయిని శ్రీనివాస్, మాశెట్టి శ్రీనివాస్, పైడిమరి నరసింహారావు, గుడిపాటి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.