అడవిదేవులపల్లిలో రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు
– మండల వ్యవసాయ అధికారి జి సరిత
అడవిదేవులపల్లి,అక్షిత ప్రతినిధి:-
అడవిదేవులపల్లి రైతు వేదిక నందు మండల వ్యవసాయ అధికారి జి సరిత రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రం ను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా పధకం నందు రైతులకు నగదు వారి యొక్క ఖాతాలలో జమ చేయబడతాయని తెలియజేసారు.రైతు భరోసా పై ఏమైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్నచో ఏఈఓ లను గాని,మండల వ్యవసాయ అధికారిని గాని సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రావుల నరేష్ మరియు రైతులు పాల్గొన్నారు.