కర్షక సహకార సంఘాలను అకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద

కర్షక సహకార సంఘాలను అకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద

వరంగల్, అక్షిత బ్యూరో:

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఉదయం వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామం, పర్వతగిరి మండలంలోని చౌటుపల్లిలలో గల కర్షక సేవ సహకార సంఘాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సహకార సంఘాల ఎరువులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లు మందులను,
కోపరేటివ్ సొసైటీ రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎంఆర్పి ధరలకే ఎరువులను విక్రయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడే ఎరువులు కొనుగోలుకు వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుని, యూరియాను ఎక్కువగా వినియగించకుండా అవసరం మేరకే ఉపయోగించాలని సూచించారు. నల్లబెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇష్టపడి చదవి భావి భారత పౌరులుగా ఎదగాలని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల ప్యాడ్ లు, నోట్ బుక్స్ లను కలెక్టర్ అందించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి, అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking