సాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టండి

సాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, అక్షిత బ్యూరో

వర్ధన్నపేట ఎస్సారెస్పీ ప్రధాన కాలువను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
సాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపటట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని
వర్ధన్నపేట ఎస్సారెస్పీ ప్రధాన కాలువను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నీటి లభ్యతను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ద్వారా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని రావూరు, ధూప తండా, కల్లెడ పర్వతగిరి తదితర తదితర గ్రామాలలోని
నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటూ రైతుల పంటలు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఇరిగేషన్ ఇంజనీర్ శంకర్ చౌహాన్ డి ఈలు కిరణ్ కుమార్, ఎన్ రాజు ఏఈలు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking