గౌతమ్ హైస్కూల్ విద్యార్థినికి జిల్లాలో ప్రధమ బహుమతి

గౌతమ్ హైస్కూల్ విద్యార్థినికి జిల్లాలో ప్రధమ బహుమతి

ఖమ్మం /అక్షిత బ్యూరో :

ఇండియన్ బ్రిల్లియంట్ ఒలింపియాడ్ (ఐబిఓ) తెలంగాణ నిర్వహించిన జిల్లా స్థాయి చిత్రలేఖన విభాగంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గౌతం హైస్కూల్ విద్యార్థిని గండు ప్రణవి తన అసాధారణ ప్రతిభను కనబరిచింది. 5వ తరగతికి చెందిన ప్రణవి ఈ పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని గెలుచుకుని అందరికీ గర్వకారణంగా నిలిచింది.ఈ విభాగంలో ఖమ్మం జిల్లా నలుమూలల నుండి సుమారు 520 మంది విద్యార్థులు పాల్గొనగా అందరిలోను ప్రణవి తన అపూర్వ సృజనాత్మకతను ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఐబిఓ నిర్వహకుల ప్రకారం మార్చి 6న హైదరాబాద్‌లోని త్యాగరాయ గాణసభ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించే బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.ఈ సందర్భంగా గౌతమి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కనపర్తి కోటేశ్వరరావు గౌతమ్ హైస్కూల్ యాజమాన్యం ప్రణవిని ప్రత్యేకంగా అభినందించి గౌరవ సూచక జ్ఞాపికను అందజేశార.ఈ కార్యక్రమంలో గౌతమ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ కనపర్తి నాగేశ్వరరావు వైస్ ప్రిన్సిపాల్ చక్రి ఉపాద్యాయులు విజయలక్ష్మి అనిత పద్మ శ్రావణ్ మొదలగువారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking