తెలంగాణ జన సమితి పార్టీ ఖమ్మం జిల్లా నూతన కమిటి ఎన్నిక

తెలంగాణ జన సమితి పార్టీ ఖమ్మం జిల్లా నూతన కమిటి ఎన్నిక

-ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా షేక్ సర్దార్ హుస్సేన్ భట్టు రాజేంద్ర నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక

ఖమ్మం /అక్షిత బ్యూరో :

తెలంగాణ జన సమితి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా షేక్ సర్దార్ హుస్సేన్ భట్టు రాజేంద్ర నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్ రావు సమక్షములో ఖానాపురం హవేలి నూర్ రెసిడెన్షిలో జిల్లా జనరల్ బాడీ సమావేశము నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి పార్టీ నిర్మాణంలో భాగంగా ఈ సమావేశంలో పార్టీ మండల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మం నగర అధ్యక్షులుగా బెల్లంకొండ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా షేక్ మహ్మద్ పాషా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బయ్యారం ఉక్కు కర్మాగారము నిర్మించాలని ది.24.02.2025న జరిగే అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ జన సమితి పార్టీ మద్దతు తెలుపుతుందని అలాగే అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని తీర్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం కేటాయించాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సమావేశములో తీర్మానించినారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఇంచార్జి గోపగాని శంకర్రావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం అందరూ పార్టీ కొరకు శక్తి వంచన లేకుండ కృషిచేయాలని పార్టీ నిర్మాణముపై దృష్టిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కారాల కొరకు పనిచేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు షేక్ సర్దార్ హుస్సేన్ మాట్లాడుతూ నాకు జిల్లా అధ్యక్షులుగా ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రో.కోదండరామ్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొపగాని శంకర్రావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఖమ్మం జిల్లా లో టీజేఎస్ పార్టీ కృషిచేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking