మీడియాపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

మీడియాపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి..

పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఊరుకునేది లేదు

•తక్షణమే రామగుండం ఎమ్మెల్యే అనుచరులు మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

•సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్…

కోదాడ, అక్షిత ప్రతినిధి :

పత్రికా స్వేచ్ఛకు భంగం కల్పిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. ఆధారాలతో వార్తలు రాస్తే జీర్ణించుకోలేక మీడియాపై కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పత్రికలను కించపరిచే విధంగా మాట్లాడడం రామగుండం ఎమ్మెల్యే అనుచరులకు తగదని తక్షణమే వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలో మాట్లాడుతూ…. ప్రజా సమస్య ఉంటేనే ఆధారాలతో పత్రికలు వార్తలు రాస్తాయన్నారు. అక్రమాల పైన రాసేవి ఇన్వెస్టిగేషన్ స్టోరీలని, ఇవి వారి సోర్సును బట్టి పత్రికల రాస్తాయని తెలిపారు. ప్రెస్ మీట్ లాగా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని రాయరని !… పక్కాగా సమాచారం ఉంటేనే పూర్తి ఆధారాలతో వార్తల ప్రచురిస్తారని గుర్తు చేశారు. రాజకీయంగా పరంగా ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి కాని, పరిధి దాటి మీడియాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తక్షణమే మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా మీడియా పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking