జోరుగా అక్రమ నిర్మాణాలు..
ప్రభుత్వ భూములపై నిర్మాణాలు చేపడితే చర్యలు ఉండవా..?
అధికారపార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలంటూ విమర్శలు వెల్లువ..
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ మండల పరిధిలో ప్రభుత్వ భూములు కాపాడటంలో రెవెన్యూ అధికారులు విఫలమై పోతున్నారని. ఆర్.ఐ. వీఆర్ఏల అనుసంధానంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ ప్రక్కన 60 గజాలలో లక్ష్మీ నగర్ కాలనీ సర్వే నంబర్ 576,577 ప్రభుత్వ భూమిలో అక్రమనిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి,ఫెక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమనిర్మాణాలు సాగిస్తున్న రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడంలో వెనుకడుగు ఎందుకు అని వాపోతున్నారు నిర్మాణదారులతో ములక్కాత్ అయినట్టేనా.? రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇందిరమ్మ కాలనీ అంబేద్కర్ భవన్ దగ్గర 200 గజాలలో వారం రోజుల క్రితం బెస్మేట్ నిర్మించిన కబ్జాదారులు భారీ అక్రమ నిర్మాణానికి తెరలేపారు,ఇందిరమ్మ కాలనీ వాటర్ ప్లాంట్ సమీపంలో 59 జీవో పేరుతో యథేచ్ఛగా అక్రమనిర్మాణాలు సాగిస్తున్న కన్నెత్తిచూడడంలేదని విమర్శలు వెల్లివెత్తుతున్నాయి రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే అక్రమనిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు..