రూరల్ సీఐగా పిఎన్డి ప్రసాద్

రూరల్ సీఐగా పిఎన్డి ప్రసాద్
మిర్యాలగూడ, మార్చి 9 అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ రూరల్ పోలిసు సిఐగా పసుపులేటి నాగదుర్గాప్రసాద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన కె.వీరబాబు బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో హైదరాబాద్ నగరం మొగల్ పుర స్టేషన్ ఎస్ హెచ్ఓగా పనిచేస్తున్న ప్రసాద్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐకి ఎస్ఐలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రసాద్ గతంలో నల్లగొండ, మిర్యాలగూడలో ఒన్ టౌన్ సీఐగా కొన్నాళ్ళు పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలో ముఖ్యంగా ఇసుక, పిడిఎస్ బియ్యం, గంజాయి అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తామని, అణచివేస్తామని అన్నారు. తమ చుట్టుపక్కల జరిగే అక్రమాలపై ప్రజలు బాధ్యతగా సమాచారం అందించాలన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందజేయాలన్నారు. అన్యాయం జరిగిన వారు ఎలాంటి ఫైరవీలు లేకుండా నేరుగా తమను సంప్రదించాలని కోరారు. ఆయా ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులు, అనుమానాస్ప దంగా కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు. ఆయన వెంట ఎస్ఐ లు కృష్ణయ్య, సిహెచ్ వెంకటేశ్వర్లు, ఏ.సైదులు, ఏఎస్ఐ ఉమాపతి, సిబ్బంది వున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking