అబద్ధాలు వల్లిస్తున్న … మహిమూద్ అలీ

అబద్ధాలు వల్లిస్తున్న
    మహిమూద్ అలీ

33 ఏళ్లుగా గుత్తాధిపత్యం

నర్సింగ్ కాలేజీ అద్దె
లక్షల్లో పెండింగ్

మస్జిద్ కమిటి గురించి మహమూద్ అబద్ధాలు

*ముసల్లియానే మస్జిద్

మిర్యాలగూడ, మార్చి 7 అక్షిత ప్రతినిధి : అతనో నియంత… మస్జిద్ కాంప్లెక్స్ లో స్వంతంగా నర్సింగ్ కళాశాల పెట్టీ కోట్లు గడిస్తూ మస్జిద్ కమిటీకి లక్షల్లో అద్దె పెండింగ్ పెట్టారు. పేద విద్యార్దులకు మైనార్టీ సంక్షేమo ముసుగులో కుచ్చు టోపీ పెడుతుండు.మస్జిద్ సరాయే మీరాలం గురించి అన్నీ అబద్ధాలు వల్లిస్తుండు. 33 ఏళ్లుగా గుత్తాధిపత్యంగా చేలాయిస్తుండు. ఇదిలా ఉంటే ఎండి.మహమూద్ ఆలీ గురువారం చేసిన విలేఖరుల సమావేశంలో మస్జిద్ సరాయే మీరాలం గురించి అన్ని అబద్ధాలు చెప్పారని మస్జిద్ ముసల్లియాన్ (నమాజ్ కు వచ్చే వారు) షేక్ అబ్దుల్లా, ఎంఎ.నాహిద్, ఎంఎ.సమీఖాద్రీ , ఖాజా హామీదుద్దిన్, ఎండి.అస్లాంలు ఆరోపించారు. శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ గురువారం మహమూద్ విలేఖరుల సమావేశంలో పూర్తిగా అబద్ధాలు చెప్పారని వారన్నారు. సరాయే
మీరాలం మస్జిద్ కమిటీ ఎండి. మహమూద్ ఆలీ అధ్యక్షతన కార్యవర్గాన్ని నవంబర్ 16, 2021లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు మూడేళ్ల కాలానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మూడేళ్ళ పదవీ కాలం నవంబర్ 16, 2024లో ముగిసిందన్నారు. కమిటీ గడువు పొడిగించలేదన్నారు. సుమారు 33 సంవత్సరాల క్రితం వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ముసల్లియాన్ మస్జిద్ తో ఎన్నిక ద్వారా ఎన్నికైన
మహమూద్ ఆలి ప్రతి మూడు సంవత్సరాలకు ఎన్నిక నిర్వహించకుండా వక్ఫ్ బోర్డు నుండి ప్రతీ సారి పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ 33 సంవత్సరాల నుండి తన గుత్తాదిపత్యాన్ని, ఏక చాత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను చట్టబద్ధంగా విన్నవించుకున్నామని రాజకీయం లేనే లేదన్నారు. కమిటీ గడువు ముగిసిన తర్వాతనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఎన్నికలు పెట్టాలని బోర్డుకు సిఫార్సు లేఖ ఇచ్చారన్నారు. కమిటీ ఎమ్మెల్యే రద్దు చేయించారని ఆరోపణ నిరాధారమన్నారు. ఈ విషయంలో అందరికి అపోహలు మహమూద్ ఆలీ కల్పించారన్నారు. వక్ఫ్ బోర్డు కాంప్లెక్స్ కోర్టు ఆదేశాలు రాకముందు, వచ్చిన తర్వాత అద్దెలు వసూలు చేసి వక్ఫ్ బోర్డుకు చెల్లించకుండా తన వద్దనే లక్షలు ఉంచుకున్న ఘనత ఆయనదన్నారు. కాంప్లెక్స్ లో మహమూద్ ఆలీ నివాసముంటూ, నర్సింగ్ కాలేజీ నిర్వహిస్తూ లక్షలు అద్దె చెల్లించని ఘనత ఆయనదన్నారు. వక్ఫ్ బోర్డుకు, ప్రజలకు లెక్కలు చూపని ఘనత ఆయనదన్నారు. ఆయనపై ఆరోపణలు చేసే వారు బాకీ ఉన్నారని ఆయన ఎంత బాకీ లెక్కలు తేల్చాలన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడం, చనిపోయిన వారిని కూడ వక్ఫ్ బోర్డును బురిడీ కొట్టించి మస్జిద్ కమిటీలో కార్యదర్శిగా నియమింప చేసిన ఘనత ఆయనదన్నారు. మస్జిద్ కమిటీ కేసును హైకోర్టు ఈ నెల 25కు వాయిదా వేయగా తనకే కోర్టు ఉత్తర్వులు అనుకూలంగా వచ్చాయని చెప్పుకునే ఘనత ఆయనదన్నారు. ఆరోపణలు చేసే వారు భక్షకులైతే ఆస్తులు, సొమ్ము కాపాడే వారు బోర్డుకు, ప్రజలకు లెక్కలు ఎందుకు చూపరాన్నారు. మస్జిద్ లో కనీస సౌకర్యాలు మెరుగు పరచ లేదు, బాగోగులు పట్టించుకోలేదన్నారు. మిర్యాలగూడ పట్టణంలో 30 మస్జిద్ లున్నా సరాయే మీరాలం ఒక్కటే వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉంది కమిటీ కాలం ముగిసినందున 15 ఫిబ్రవరి 2025న వక్ఫ్ బోర్డు అధికారులు అధీనంలోకి తీసుకుని బాధ్యతలు చేపట్టారన్నారు. అదేవిధంగా మస్జిద్ బోరు మోటార్ చెడి పోతే వక్ఫ్ ఇన్స్పెక్టర్ చే కొత్త మోటార్ బిగించడం జరిగిందన్నారు. మరీ సేవ చేస్తున్న వారు ఎక్కడ దాక్కున్నారన్నారు. మసీదులోని వస్తు, సామాగ్రి జాబితా రాసుకుని, సిసి కెమెరాలు తొలగించి వక్ఫ్ బోర్డు అధికారులు తీసుకెళ్లారన్నారు. సీసీ కెమెరాల ధ్వంసం చేశారన్నది పచ్చి అబద్ధమన్నారు. ముగిసిన కమిటీని ఎందుకు కొనసాగించాలి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. అంతే ఎవరు గెలిస్తే వారే అన్నారు. సమావేశంలో ఎండి.ముజీబ్, ఎండీ.అరిఫ్, ఎండీ.ఆసిఫ్, హంజా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking