దివ్యాంగులకు ఆసరా
వీల్ చైర్స్ అందించిన
ది లివింగ్ బ్రెడ్ సొసైటీ
ది లివింగ్ బ్రెడ్ సొసైటీ ఇండియా సైట్ డెరైక్టర్ అభిలాష కర్నాటి
ఆలేరు, అక్షిత ప్రతినిధి :
దివ్యాంగులకు ది లివింగ్ బ్రెడ్ సొసైటీ ఆసరాగా నిలుస్తుంది. 6 గురు దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించింది. పేద, బడుగు బలహీనవర్గాలకు చెందిన పేదలకు అండగా నిలిచేందుకు ఐసిఎం సహకారంతో 6 గురు దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించి చేయూత నిచ్చి అక్కున చేర్చుకుంది. ఈ సందర్భంగా ది లివింగ్ బ్రెడ్ సొసైటీ ఇండియా సైట్ డెరైక్టర్ అభిలాష కర్నాటి మాట్లాడుతూ పేదలకు కాసింత వెన్నంటి ఉండేందుకు పలు సామాజిక సేవలు అందిస్తున్నామన్నారు.

నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు… వీల్ చైర్స్ వారికి ఊరట కల్గించనుందన్నారు. విద్య, వైద్యం తదితర అంశాలపై పేదలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.

పేద విద్యార్దులకు తమ సంస్థ అండగా నిలుస్తుందని, మహిళలు వివిధ శిక్షణల్లో తర్ఫీదు నిచ్చి స్వతహాగా ఆర్థిక పరిపుష్టి పొందేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసన్న కుమార్, లివింగ్ బ్రెడ్ సంస్థ స్టాఫ్ గంధం షాలెం కమలాకర్, మేడ స్వరాజ్, తిరుకోవలురు పవన్, సుక్క సంతోష్, పోలేపాక బాబు, చిలుక మధు తదితరులు పాల్గొన్నారు.