31 లోగా ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే 25% రిబేటు

31 లోగా ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే 25% రిబేటు

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు ఈ నెల 31 లోగా ఎల్ఆర్ఎస్ ను చెల్లించిన వారికి 25% రిబేటు ఇస్తున్న విషయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై లైసెన్స్ టెక్నికల్ ప్లానర్లు, లే ఔట్ ఓనర్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పై 25 శాతం రిబేటు ప్రకటించడం ప్రజలకు గొప్ప అవకాశం అని,ఇది తిరిగి రాదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు స్పష్టం చేయాలని చెప్పారు. ఎల్ ఆర్ ఎస్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఎల్ ఆర్ ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఫ్లెక్సీ బ్యానర్లు, ప్రకటన ఇవ్వాలని ఆమె సూచించారు. గతంలో నల్గొండ జిల్లాలో ఎల్ఆర్ఎస్ పెద్ద ఎత్తున చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా ఎల్ఆర్ఏస్ నిర్దేశించిన సమయంలో గా విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారం కార్యచరణ ప్రణాళిక తయారు చేసుకొని పారదర్శకంగా శాస్త్రయుక్తంగా చేపట్టాలని ఆమె తెలిపారు.మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముజాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking