ఎంపిజే ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ కిట్లు పంపిణీ
ఖమ్మం/అక్షిత బ్యూరో :
రంజాన్ పవిత్ర మాస ఉపవాస దీక్షలు 9వ రోజుకు చేరిన సందర్భంగా ఖమ్మం ఎంపిజే జిల్లా ప్రధాన కార్యాలయంలో పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల కిట్ లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా ఎంపిజే ఫౌండర్ మెంబర్ మరియు ఆక్స్ఫర్డ్ హైస్కూల్ కరెస్పాండెంట్ జాఫర్ మతీన్ హాజరై కిట్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలెనే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం లో పేద ముస్లిం లకు నిత్యవసర సరుకులు అందించడం బాధ్యత గా భావిస్తున్నాము.ఎంపిజే ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షం వహించి శాంతి న్యాయం కోసం పాటుపాడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీజే జిల్లా ఉపాధ్యక్షులు ఎంఏ గఫార్ కోశాధికారి ఎండి హకీమ్ కార్యదర్శి ఎండి రజబలి సభ్యులు గఫార్ హుసేన్ మియా రఫీక్ తదితరులు పాల్గొన్నారు.