విలువల జర్నలిజం అవసరం

విలువలతో కూడిన
జర్నలిజం అవసరం

ఐజేయూ మాజీ అధ్యక్షుడు
దేవులపల్లి అమర్

రంగారెడ్డి, అక్షిత బ్యూరో :

విలువలతో కూడిన జర్నలిజం అవసరమని ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ అన్నారు. మంగళవారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ద్వితీయ మహాసభ ప్రగతి రిసార్ట్స్ లో జరిగింది. మహాసభకు ఐజెయూ మాజీ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు విరాహత్ అలీ, భారత రాష్ట్ర సమితి జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐజెయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం అవసరం ఉన్నదని ఆయన అన్నారు.

జర్నలిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనీయంగా ఉన్నదని ఆయన అన్నారు. జర్నలిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ పుట్టగొడుగుల్లా అనేకమంది జర్నలిస్టులమని చెప్పుకొని తిరుగుతూ వ్యవస్థను పలుచన పడేస్తున్నారని ఆయన అన్నారు.

ఇట్లాంటి వాటిపై జర్నలిస్టులు దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉన్నదని ఆయన పిలుపు నిచ్చారు. భారత రాష్ట్ర సమితి స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టితో ఆలోచన చేసేందుకు బాధ్యత తీసుకొని మీకు అండగా నిలబడతానని ఆయన జర్నలిస్టులకు భరోసా కల్పించారు.

జిల్లాలోని జర్నలిస్టులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా రక్షణకు అవసరపడిన ప్రీమియమును అందజేసిన భారత రాష్ట్ర సమితి జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డికి జిల్లా కార్యవర్గo కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్య క్రమంలో జాతీయ రాష్ట్ర జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking