విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి విద్యుత్ షాక్ తో నిండు ప్రాణం బలి
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
విద్యుత్ షాక్ తో ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన కొండాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ లోని శ్రీరాంనగర్ ఏ బ్లాక్ లో పనిచేస్తున్న సమయంలో రామకృష్ణ(35) సంవత్సరాలు రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రయివేటు కాంట్రాక్టర్ తో కూలి ఈ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రఘుబాబు అనే కాంట్రాక్టర్ ద్వారా కరెంటు స్తంభాలు ఎత్తడం గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు కరెంటు శాఖ అధికారుల నుండి పర్మిషన్ తీసుకోకుండా పనులు కొనసాగించడంతో స్తంభం ఎత్తే క్రమంలో ఒక్కసారిగా షాక్ కొట్టడంతో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి రాంబాబు కొండాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయంలో ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం లేకుండా విద్యుత్ వైర్లు లాగడం తదితర పనులు పూర్తిగా నిషిద్ధం ఇలాంటి పనులు కొనసాగించడంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని కేవలం కొంతమంది అవినీతి అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇలాంటి అనధికారిక పనులు చేపడుతున్న సమయంలో ప్రమాదానికి గురై అమాయక కార్మికులు చెందుతున్నారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేసిన వ్యక్తులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలు ఆగే పరిస్థితి లేదని స్థానికులు తెలిపారు. అలాగే శ్రీరామ్ నగర్ ఏ.బి.సి బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంటు లు కాలనీలో పరిమితికి మించిన అదనపు ప్లోర్ లు వేస్తూ హాస్టల్ లకి అద్దెలకిచ్చి అధిక అద్దెలకి ఆశపడి కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకి కారణం అవుతున్నారు అని డిప్యూటీ కమిషనర్ కి లిఖిత పూర్వకంగా కంప్లయింట్ ఇవ్వడం జరిగింది అని, నీటి కొరత, పరిమితికి మించిన ప్లోర్ లు ఉండడం వలన డ్రైనేజ్ పొంగిపోర్లడం, ద్విచక్ర వాహనదారులు పార్కింగ్ రోడ్లపైనే పెట్టడం వలన రాకపోకలకి అంతరాయం యువత అర్థరాత్రి వరకు మధ్యం, మత్తు పదార్థాలకి అలవాటు పడి, దొంగతనాలకి పాల్పడ్డ ఉదంతాలు ఎన్నో జరిగాయి అని ఈ సంధర్భంగా తెలియ జేశారు. జి.హెచ్ఎం.సి అధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని గతంలో ఎన్నో ధర్నాలు, నిరసన ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని ఇప్పటికైనా సంభందిత అధికారులు బాధ్యతా యుతంగా వ్యవహరించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.