అంగరంగ వైభవంగా రథోత్సవం…

అంగరంగ వైభవంగా రథోత్సవం…
– కనుల పండుగగా శివపార్వతుల కళ్యాణం..
– పెద్ద ఎత్తున హాజరైన భక్తులు…
అందోలు, అక్షిత ప్రతినిధి :
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని అందోలు మండలంలోని కన్సాన్ పల్లి గ్రామంలో గురువారం మంజునాథ స్వామి రథోత్సవ ఊరేగింపు భక్తుల శివనామ స్మరణల మధ్య వైభవంగా సాగింది. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో శివపార్వతుల కళ్యాణ తంతు గ్రామ పురోహితులు ఆనంద్ శర్మ శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు.మహా శివరాత్రి రోజున, నిషితా కాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది, నిషితా కాలం జరుపుకుంటారు. ఈ రోజున, అన్ని శివాలయాలు లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహించాలని, శివపార్వతుల కళ్యాణం భార్యాభర్తల్లో నమ్మకాన్ని పెంచుతుందని పురోహితులు భక్తులకు సూచించారు.


స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు గ్రామస్తుల తో పాటు మహిళా భక్తులు పెద్ద ఎత్తున హాజరైనారు. కళ్యాణం ముగిసిన అనంతరం భక్తులు స్వామి వారి కి కళ్యాణ కట్నాలు సమర్పించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అన్నధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రథోత్సవాన్ని నిర్వహించారు. రథంపై శివపార్వతుల విగ్రహాలను ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా రథోత్సవ ఊరేగింపును చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా నీళ్ల బిందెలతో రథోత్సవానికి ఎదురుగా వెళ్లి నీళ్లతో చాకలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్,మాజీ ఎంపిటిసి బాలయ్య, కాంగ్రెస్ నాయకులు కృష్ణ, గోవర్ధన్, మాణయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking