నేటి నుంచి పది పరీక్షలు

నేటి నుంచి పది పరీక్షలు

సిసి కెమెరాల మధ్య
పకడ్బందీ ఏర్పాట్లు

*హాజరు కానున్న 2,737 మంది విద్యార్థులు

మిర్యాలగూడ, మార్చి 20 అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో ఈనెల 21 నుండి నుండి ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతాయని అన్ని కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ మండల విద్యాధికారి లావురి బాలునాయక్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎస్ఎస్సి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయన్నారు. అన్ని కేంద్రాలలో పరీక్షలకు హాజరై విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించామన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని 12 పరీక్ష కేంద్రాలలో 2,737 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

బాలురు 1,417 బాలికలు 1,320 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల 200 మంది విద్యార్థులు, జడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు, సెంట్ మేరీ హైస్కూల్లో 227 మంది విద్యార్థులు, భారత్ హైస్కూల్లో 150 మంది విద్యార్థులు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల చైతన్య హైస్కూల్లో 200 మంది విద్యార్థులు, బకాల్వాడ జడ్పి హైస్కూల్లో 200 మంది విద్యార్థులు, ఎస్పిఆర్ స్కూల్లో 280 మంది విద్యార్థులు, కాకతీయ స్కూల్లో 240 మంది విద్యార్థులు, కృష్ణవేణి స్కూల్లో 240 మంది విద్యార్థులు, అభ్యాస్ టెక్నో హైస్కూల్లో 280 మంది విద్యార్థులు, కృష్ణ కాలనీ శ్రీ చైతన్య స్కూల్లో 280 మంది విద్యార్థులు, శివాని హైస్కూల్లో 240 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని బాలు నాయక్ తెలిపారు. 12 కేంద్రాలలో 12 చీఫ్ సూపరింటెండెంట్లు, 12 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 150 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ప్రతి కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నామని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు మంచినీటి వసతి విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆన్ లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి హాజరు కావచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్లు పూర్తిగా నిషేధమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking