ఇన్వెస్టర్ల మదిలో “రాజా ” పదిలం
కోటి ఆశలతో… కొత్త ఏడాదిలోకి
‘రాజా ఇన్ ఫ్రా’ 14 వసంతాలు పూర్తి
కోలాహలంగా సంబరాలు
తార్నాక, అక్షిత ప్రతినిధి :
రాజా ఇన్ ఫ్రాకు పద్నాలుగేళ్లు నిండాయి.14 వసంతాలను పురస్కరించుకొని జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి. ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పించింది. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజును పలువురు అభినందించారు. ఇన్వెస్టర్ల మదిలో “రాజా ” పదిలంగా ఉంది. ‘రాజా ఇన్ ఫ్రా’ 14 వసంతాలు పూర్తి చేసుకొని
కోటి ఆశలతో… కొత్త ఏడాదిలోకి అడుగిడింది.

రాజా ఇన్ఫ్రా వార్షికోత్సవ వేడుకలు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.
14వ వసంతంలోకి అడుగుడిన సందర్భాన్ని పురస్కరించుకుని కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుంచే ప్రతి ఒక్కరూ ఫౌండర్ ఎస్ఎస్ రాజుని సన్మానిస్తూ స్వీట్లు పంచుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచి రాజా ఇన్ఫ్రా ఆఫీస్ కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ విష్ చేస్తూ కంపెనీ పట్ల తమకున్న ప్రేమను… అభిమానాన్ని చాటుకున్నారు.గత 14 ఏళ్లుగా ఒక కంపెనీనీ రన్ చేస్తూ కస్టమర్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎస్ఎస్ రాజును పొగడ్తలతో ముంచెత్తారు. ఇన్వెస్టర్లు మాట్లాడుతూ ఇప్పటివరకు నిజాయితీగా మాకు రిటర్న్స్ ఇస్తూ మా ఇన్వెస్ట్మెంట్లకు భరోసా ఇస్తూ మాకు ఎస్ఎస్ రాజు ఒక ధైర్యాన్ని ఇచ్చారన్నారు.

ప్రతి ఒక్కరి గుండెల్లో వారు చిరస్థాయిగా నిలుస్తూ కస్టమర్లు, ఇన్వెస్టర్లు, మార్కెటింగ్ మిత్రులకు ఆఫీస్ స్టాఫ్ కు ఒక రోల్ మోడల్ గా నిలిచారన్నారు. మరిన్ని కొత్త కొత్త ప్రాజెక్టలతో ముందుకు రానున్నట్లు చెప్పారు.రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజును అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ చైర్మన్ దాస్ మాతంగి, ది రూపి కంపెనీ ఫౌండర్ గణేష్ అట్లూరి, మోనోసేజ్ సీఈవో రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త వినయ్ కుమార్ కానుకుర్తిలు శాలువాలు, పూల బోకేలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజా ఇన్ఫ్రా డైరెక్టర్ రజిని, గిరిధర్, స్నేహ, నీరజ, సైబర్ సెక్యూరిటీ అశోక్ దాదాపుగా 150 మంది కస్టమర్లు, ఇన్వెస్టర్లు, హయ్యర్ అఫీషియల్స్ మార్కెటింగ్ అసోసియేట్లు పాల్గొన్నారు.