కాంగ్రెస్ పాలనలోనే గ్రామీణ రోడ్ల అభివృద్ధి..
అందోలు, అక్షిత ప్రతినిధి:
కాంగ్రెస్ పాలనలోనే గ్రామీణ ప్రాంత రోడ్లు అభివృద్ధి చెందాయని, తిరిగి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు మాజీ ఏయంసీ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, యువజన కాంగ్రేస్‌మండల అద్యక్షుడు ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం అందోలు మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో 161 నాందేడ్ అకోలా నేషనల్ హైవే నుండి గ్రామం వరకు బీడు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం రేవంతరెడ్డి సారథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు.గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా ధ్వంసం అయి ప్రయాణం నరకయాతనం గా ఉందని మండిపడ్డారు. ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు ఉండాలని సంకల్పంతోనే నియోజకవర్గంలో పలు రోడ్లకు మహర్దశ తీసుకురాబోతున్నామని అన్నారు.ఆర్భాటాలకు వెళ్లకుండా అభివృద్ధి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తానని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.కాంగ్రేస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన ఘన కాంగ్రేస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకమైన చర్య అని, అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం గొప్ప విషయమన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రేస్ ప్రభుత్వం శాసన సభ సమావేశంలో కులగణనలో భాగంగా సుమారు 56% ఉన్న బీసీలకు మేం ఎంతో మాకు అంత అనే విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ బాలయ్య, నాయకులు మొరబోయిన క్రిష్ణ, కాంగ్రేస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు వీరన్న, నాయకులు మహిపాల్, ఆర్.నర్సింలు, మాణయ్య, యేసయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.