చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

మున్సిపల్ కమిషనర్ నాగేందర్

చేర్యాల, అక్షిత ప్రతినిధి: వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ అన్నారు. సోమవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక అంగడి బజారు లో మాజీ మంత్రి కీర్తిశేషులు నిమ్మ రాజారెడ్డి -రమాదేవి జ్ఞాపకార్థంగా, వారి మనవడు నిమ్మ నిఖిల్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి-అనిత దంపతుల కుమారుడు నిమ్మ నిఖిల్ రెడ్డితో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన నిఖిల్ రెడ్డి ని అభినందించారు. అనంతరం నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలం ఉన్నందున బాట సారులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking