ప్రజావాణిలో 6 ఫిర్యాదులు

ప్రజావాణిలో 6 ఫిర్యాదులు

మిర్యాలగూడ, మార్చి 24 అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన ప్రజావాణిలో సుమారు ఆరు ఫిర్యాదులు వచ్చాయని సబ్ కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.శ్రీనివాస్ శర్మ తెలిపారు. అనంతరం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజావాణిలో మిర్యాలగూడ తహసీల్దార్ ఎన్.హరిబాబు, డిఎల్పిఓ రాఘవరావు, ఎంపిడిఓ ఎం.శేషగిరిశర్మ, ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమత, హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్కె నసీమ మెహరిన్, పంచాయతీ రాజ్, నీటిపారుదల, ఆర్డబ్లుఎస్, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ డిఇఇలు వెంకటేశ్వరరావు, ఎంబి బేగ్, పాపారావు, ఎండి. అహ్మదుల్లా, మోతిలాల్, ఎఇఇ మానస, విద్యుత్ సబ్ ఇంజనీర్ జి.నవీన్, మునిసిపల్ జెఎ శంకర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking