కాంగ్రేస్‌తోనే పేదల సంక్షేమం
ఏయంసీ మాజీ డైరెక్టర్ శేరి వెంకట్‌రెడ్డి
అందోలు, అక్షిత ప్రతినిధి :
కాంగ్రేస్ ప్రభుత్వం అధికారలో ఉంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శేరి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం కన్‌సాన్‌పల్లి గ్రామానికి మంజూరైన తొమ్మిది కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రేస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకాలను కాంగ్రేస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రేస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, ప్రతిఒక పేద వాడికి అందించేలా కృషి చేస్తుందన్నారు. కాంగ్రేస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన ఘనత కాంగ్రేస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు విప్లవాత్మకమైన చర్య అని అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించడం గొప్ప విషయమన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పదేళ్లలో కనీసం మరమ్మతులకు నోచుకోలేక పూర్తిగా ద్వంసమై ప్రయాణం నరకయాతనంగా ఉందని మండిపడ్డారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు ఉండాలనే సంకల్పంతో కూడా నోచుకోని రోడ్లకు నేడు మహార్ధశ తీసుకురాబోతున్నామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు శివరాజ్, మాజీ ఎంపిటీసీ బాలయ్య, నాయకులు మహిపాల్, మొరబోయిన క్రిష్ణ,కాంగ్రేస్ గ్రామ పార్టీ అద్యక్షుడు వీరన్నా, రామన్నగారి నర్సింలు, బి.శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.