సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, అక్షిత బ్యూరో:

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ నగరం లోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్ లో16.7 ఎకరాల విస్తీర్ణంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జి ప్లస్ టు కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి స్థాయిలో పనుల పురోగతిని
బ్లూ ప్రింట్ మాప్ ప్రకారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు ఆడిగి తెలుసుకోగా, భవన స్ట్రక్చర్, బ్రిక్స్ వర్క్, సివిల్ వర్క్స్ ఫ్లోరింగ్ దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయని, ఫినిషింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్ కు వివరించారు. పురోగతిని రోజువారీగా అందించాలని సూచించారు. పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా చేపట్టి 2025 సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, జిల్లా రోడ్ల భవనాల అధికారి రమేష్, డిఈ శ్రీధర్,కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విశ్వ ప్రసాద్,ఏఈ శ్రీకాంత్, తసిల్దార్ ఇక్బాల్, ఏజెన్సీ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking