నిజాయితీగా పనిచేయాలి : వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్, అక్షిత బ్యూరో:
పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా నిజాయితీగా పోలీస్ అధికారులు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం తొలిసారి అత్మకూర్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో ఏర్పాటు సిసి కెమెరాల కంట్రోల్ రూంలోని సిసి కెమెరాల పనితీరు, స్టేషన్‌లోని వివిధ రికార్డు గదులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని పలు రికార్డులను తనీఖీ చేయడంతో పాటు, స్టేషన్ పనీతీరుతో పాటు ,స్టేషన్ పరిధిలో ఏలాంటి నేరాలు జరుగుతాయి, ఎంత మంది రౌడీ షీటర్లు వున్నారు, రోజు ప్రమాదాల సంఖ్య, పోలీస్ స్టేషన్ పరిధి, స్టేషన్ సిబ్బంది మొదలైన వివరాలను ఇన్స్‌స్పెక్టర్ సంతోష్‌ను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా నిజాయితీ పనిచేయాలని, ఫిర్యాదులుపై వేగంగా స్పందించాలని, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ భూపాలపట్నం ప్రధాన రోడ్డు మార్గం వుండటం ద్వారా ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తూ చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా వుండాలని పోలీస్ కమిషనర్ సూచించారు.పోలీస్ కమిషనర్ వెంట ఈస్ట్‌జోన్ డిసిపి అంకిత్ కుమార్, ఏసిపి సతీష్‌బాబు పాల్గోన్నారు.
కంఠాత్మకూర్‌లో పోలీస్ చెక్‌పోస్ట్‌ను సందర్శించిన సిపి
అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేందుకు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టును వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ డిసిపి అంకిత్‌కుమార్‌తో కల్సి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా చెక్‌పోస్టులో విధులు సిబ్బంది వివారాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, రోజు మొత్తం మీద ఎన్ని వాహనాలు తనీఖీ చేస్తారు. అలాగే అనుమతులు వున్న ఇసుక వాహనాలను ఏవిధంగా తనీఖీలు నిర్వహిస్తారని చెక్‌పోస్ట్ సిబ్బంది పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెక్‌పోస్టు సిబ్బంది తనీఖీ తీరును సిపి ఎదుట ప్రత్యక్షంగా ప్రదర్శించారు.