రాజీవ్ యువ వికాసం అవగాహన సదస్సు
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగవారం రోజు నల్లగండ్ల లోని తన నివాస కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో రాజీవ్ యువ వికాసం కార్యక్రమం గురించి పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళ నాయకురాలు, యూత్ కాంగ్రెస్, మరియ ఎన్.ఎస్.యు.ఐ నాయకులందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్య్రమంలో వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నాయకులని ఉద్దేశించియువతకు స్వయం ఉపాధిని పెంచడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం ప్రారంభించారని, దీనిపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని నాయకులని సూచించారు. అలాగే నాయకులు అందరూ దీనిపై ప్రత్యెక దృష్టి సాధించి అర్హులు అందరినీ అప్లై చేసుకోవాల్సింది మరియు తెలియని వాళ్ళందరికీ తెలియచెప్పల్సింది గా కోరారు.
ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నుండి సీనియర్ నాయకులు మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ దోర్నాల రవికుమార్ గౌడ్ , యూత్ కాంగ్రెస్ శేరిలింగంపల్లి జనరల్ సెక్రటరీ కడుకుంట్ల రాంబాబు , మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ రాయి కోటి శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు కె. నవీన్ కుమార్, చింతల సురేష్ యాదవ్ లు పాల్గొని విజయంతం చేశారు, కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ నాయకులు కడుకుంట్ల రాంబాబు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ కొరకు కులం, ఆదాయం సర్టిఫికెట్ రేషన్ కార్డు, పాన్ కార్డు మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరి అని, ఆదాయం సర్టిఫికెట్ కొత్త ఆర్థిక సంవత్సరాది అయ్యి ఉండాలి అని సూచించారు.