సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్ ను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్ ను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, అక్షిత బ్యూరో:

వరంగల్ పట్టణంలోని రంగశాయిపేట యూపీహెచ్ సి ప్రాంగణంలో గల కేంద్ర ఔషధ గిడ్డంగి (సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్) ను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఔషధాల స్టాక్ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు.

అనధికారికంగా విధులకు గైరుహజరైన సూపర్వైజర్ నాగమణి ను, విధులు సక్రమంగా నిర్వహించని ప్యాకర్ చక్రపాణి లకు షో కాజ్ నోటీసులు జారీ చేయాలని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు టిజిఎంఐడిసి ను కలెక్టర్ చారవాణి లో ఆదేశించారు.కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, యూపీహెచ్ సి. మెడికల్ ఆఫీసర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking