టీజీఇజెఏసి ఆధ్వర్యంలో
ఇఫ్తార్ విందు
ఖమ్మం /అక్షిత బ్యూరో :
టీఎన్జీవోస్ భవన్ నందు ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముజామిల్ ఖాన్ హాజరయ్యారు.రంజాన్ మాసం ఆధ్యాత్మిక భక్తికి స్వీయ క్రమశిక్షణకు ఉత్తమ సమయంగా భావిస్తారని సమాజంలో కృతజ్ఞత ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేద ప్రజలను ఆదుకోవడానికి వారికి దానం చేయడానికి కోపాన్ని నిగ్రహించుకోవడానికి ఈ రంజాన్ పండుగ జరుపుకుంటారని ముజామిల్ ఖాన్ అన్నారు.

ఖమ్మం జిల్లా జేఏసీ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు పెంపొందించే విధంగా కృషి చేస్తున్నందుకు అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీజీఇజెఎసి చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు కన్వీనర్ కస్తాల సత్యనారాయణ కో చైర్మన్ యలమద్ది వెంకటేశ్వర్లు పారుపల్లి నాగేశ్వరరావు టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్ టిజీఓస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి లెక్చరర్స్ అసోసియేషన్ సంఘం కృష్ణార్జునరావ్ సురేష్ వాసిరెడ్డి శ్రీనివాసరావు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం బిక్కు కోడి లింగయ్య డ్రైవర్ల సంఘం వెంకటేశ్వర్లు టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం ముస్లిం ఉద్యోగులు పాల్గొన్నారు.