ప్రాణాంతక రహదారిగా వేములపల్లి

*ప్రాణాంతక రహదారిగా వేములపల్లి

ఫ్లై ఓవర్ లేదు…సర్వీస్ రోడ్డు లేదు
ప్రాణాలు పోతున్నా… పట్టింపు లేదు
సిపిఐ మండల కార్యదర్శి జిల్లా యాదగిరి

అక్షిత న్యూస్, వేములపల్లి:
ప్రాణాంతక రహదారిగా వేములపల్లి రక్తమొడ్దుతుంది. ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కాలి నడకన నడుస్తూ రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే. దాటితే ఒకే…లేకుంటే ప్రాణం హరించాల్సిందే. వేములపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి జిల్లా యాదగిరి బుధవారం మండల తాహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కట్ పల్లి-అద్దంకి రోడ్డు విస్తరణలో భాగంగా హైవే రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు వేస్తామని చెప్పిన ఆనాటి కాంట్రాక్టర్ నేటి వరకు సర్వీస్ రోడ్డు నిర్మించ లేదన్నారు. హైవే పై వెళ్తున్న బాటసారులతో పాటు ద్విచక్ర వాహనదారులు నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నరన్నారు,
హైవే వెంట సర్వీస్ రోడ్డుపై నడవడానికి చోటు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుస్తున్నప్పటికీ అవగాహన లేని కొంత మంది డ్రైవర్లు అతివేగంతో అజాగ్రత్తతో వాహనాలను నడుపుకుంటూ ఎంత జాగ్రత్తగా వెళ్తున్న కార్ల డ్రైవర్లు అతివేగంతో వెళ్తూ ద్విచక్ర వాహనదారులకు బాటసారులను ఢీకొంటూ వెళ్లడంతో అనేక మంది ప్రమాదానికి గురై మృతి చెందడంతో మృతుల కుటుంబసభ్యులు వీధిపాలవుతున్నారన్నారు. ఒక్క నెలలోనే మండల కేంద్రమైన వేములపల్లిలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, మరి కొంతమంది రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే తక్షణమే హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా బాధిత కుటుంబాలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking