గొప్ప వ్యక్తిని కోల్పోయాం

గొప్ప వ్యక్తిని కోల్పోయాం

పారదర్శకంగా ప్రవీణ్
కేసును చేధించాలి

క్రైస్తవ ఐక్య సంఘాల ర్యాలీ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మహోన్నత వ్యక్తిత్వం ప్రవీణ్ పగడాలది. మతం కాదు… మనిషిని మనిషిగా చూడాలన్నది అతని అభిమతం. క్రైస్తవ్యం మతం కాదు… చక్కటి మార్గం అంటూ అతని ఉపదేశాలు. సామాజిక స్పృహ కల్గిన గొప్ప విలక్షణ శీలి. పేదోళ్ల పెన్నిధి. రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు కల్గి ఆర్థికంగా స్థితిమంతుడుగా ఉన్నప్పటికి సామాన్య జీవన విధానం అతని సొంతం.

అనాథలైన పిల్లలను అక్కున చేర్చుకొని తమ ఇంట్లోనే సకల సదుపాయాలతో ఉన్నతమైన జీవితాలను ప్రసాదించిన … అతని జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. అతని మరణం ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ లోకాన్ని తట్టి లేపింది. విభిన్న సంఘాలు, అభిప్రాయ భేదాలున్నప్పటికీ అందరిని ఏకం చేసింది. ప్రవీణ్ పగడాల మరణం పలు అనుమానాలకు తావిస్తుంది.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న అన్ని పాస్టర్ల ఫెలోషిప్ల కమిటీలు, సంఘ పెద్దలు, క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో కూడుకొని మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఆర్ సీఎం చర్చి నుండి రాజీవ్ చౌక్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది.

వందలాది మంది హాజరై శాంతియుత ప్రదర్శన జరిగింది. ప్రవీణ్ పగుడాల అమర్ రహే అంటూ… నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండు చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ చేసి మరణానికి కారణాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరారు.ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు… భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకునే అవకాశం అన్ని మతాలకు కల్పించాలని, క్రైస్తవ విశ్వాసులకు, సంఘ కాపరులకు రక్షణ కల్పించాలని, ఆలయాల నిర్మాణాలకు, ఆలయాల నిర్వహణకు పూర్తిస్థాయిలో సహకరించవలసిందిగా కోరారు. ర్యాలీకి అనుమతి ఇచ్చి సహకరించిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు ముండ్లగిరి కాంతయ్య, ప్రధాన కార్యదర్శి చిలుక విద్యాసాగర్, ఉపాధ్యక్షులు పుట్టల రోశయ్య, దైద సైదులు, జాయింట్ సెక్రెటరీలు చెట్టుపల్లి హేండ్రి మోజెస్, కాశీమల్ల చార్లెస్ బెంజమిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రమల దినేష్, సంఘ పెద్దలు కెఎస్ విక్టర్, చెట్టిపల్లి సాల్మన్, కోడిరెక్క మట్టయ్య, నజరేతు ప్రేయర్ హౌస్ సంఘ కాపరి, సీనియర్ దైవ జనులు రెవ. డా.కిరణ్ కుమార్ సౌపాటి, రెవ.డా.ఎన్ ఎస్ హరిబాబు, శేషయ్య, ఇమ్మానియేల్, విల్సన్, ప్రవీణ్ కుమార్, బెంజమిన్, అరుణ్ కుమార్, మాదాసి రవికుమార్, జియన్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking