క్రీడలతో మానసిక ఉల్లాసం

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం

యువకులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

పోటీతత్వంతో ఆడినప్పుడే క్రీడల్లో విజయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి

రామన్నపేట, అక్షిత ప్రతినిధి :

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదడతాయని, క్రీడా స్ఫూర్తితో పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి అన్నారు. ఆదివారం నాడు రామన్నపేట పట్టణ కేంద్రంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో, మరియు మండల నాయకుల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన మైదానంలో రామన్నపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 3 టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో మైదానంలో బ్యాటింగ్ చేసి అలరించారు.గ్రామీణ ప్రాంత యువకులు క్రికెట్లో చక్కటి ప్రదర్శన ద్వారా గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి ఎదగాలని ఆయన కోరారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపరిచినప్పుడే విజేతలుగా నిలుస్తారన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజం అని, ఒడినవారు మరోసారి గెలుపునకు ప్రయత్నించాలనీ సూచించారు. ఆటలతో శారీరక దారుఢ్యం మెరుగుపరడమే కాకుండా మానసికోల్లాసం కలుగుతుందన్నారు.


క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అందరితో స్నేహపూర్వకంగా మెదులుకోవాలని సూచించారు. మీకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహకరిస్తానని తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జినుకల ప్రభాకర్,మాజీ సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్, గుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎంపిటిసి ఎండి రెహాన్, జెల్లా వెంకటేష్, రామిని రమేష్,ఎండి జమీరుద్దీన్, గరిక సత్యనారాయణ, ఎండి అక్రమ్,సాల్వేరు లింగం, మోటే రమేష్,కోట సుధాకర్,కొమ్ము శేఖర్, వడ్లకొండ సాయి కృష్ణ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking