మానవత్వానికి ప్రతీక …కందగట్ల సిద్దురెడ్డి
చల్లని మజ్జిగ కేంద్రాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
చల్లని మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించి ఎంతోమంది ప్రజల దాహాన్ని తీరుస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి
శంషాబాద్, ఏప్రిల్ 06, అక్షిత ప్రతినిధి :
ఎండాకాలం వచ్చిందంటే ఎంతో మంది ప్రజలు ప్రయాణికులు వాహనదారులు దాహానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఏకంగా ఓ వ్యక్తి మానవత్వం చాటుకుంటూ ప్రజల కోసం ఏకంగా చల్లని మజ్జిగని అందిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త కందకట్ల సిద్దు రెడ్డి ఆయన శ్రీరామ నవమి ఆదివారం నాడు ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారి ఫ్లైఓవర్ కింద వాహనదారులు ప్రజలు కూలీలు ప్రతి ఒక్కరి దాహం తీర్చడానికి చక్కటి చల్లని మజ్జిగను ఏర్పాటు చేసి ఆదివారం నాడు ప్రారంభించారు.
చాలా మంది ప్రజలు ప్రతి సంవత్సరం సిద్దు రెడ్డి చల్లని మజ్జిగ ప్రారంభిస్తారని ఎదురు చూస్తూ ఉంటారు వారి ఎదురు చూపులకు పడకుండానే ఆదివారం నాడు ప్రారంభించారు.
ఎంతో మంది ఎంతో ఉన్నా కానీ ఒకరు ఇలాంటి సాహసం చేయరు. అను కందగట్ల సిద్దు రెడ్డి మాత్రం ప్రతి సంవత్సరం ఎవరు చెప్పినా చెప్పకపోయినా తన పని తాను మాత్రం చేసుకుంటూ వెళ్తారు. తన ప్రజల్లో ప్రజల మనసులో నిలిచిపోయిన వ్యక్తి సిద్దు రెడ్డి చేస్తున్న మంచి పనికి ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.