భూమున్నోళ్లు ఫార్మర్
కార్డును పొందాలి
కిషోర్ నాయక్
వేములపల్లి, అక్షిత న్యూస్ :
భూమి ఉన్న ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఫార్మర్ కార్డును పొందాలని వేములపల్లి వ్యవసాయాధికారి రామావత్ కిషోర్ నాయక్ తెలిపారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా 11 అంకెల గల ఫార్మర్ రిజిస్టర్ కోసం( రైతు గుర్తింపు కార్డు) అందుబాటులోకి తీసుకొచ్చిందని, అట్టి కార్డును పొందాలంటే ప్రతి ఒక్క రైతు తమ పట్టేదారు పాసుబుక్, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు అనుసంధానం అయినటువంటి మొబైల్ ఫోన్ తీసుకొని వచ్చి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతుకే రైతు వేదిక కేంద్రంలో నమోదు చేసుకొని రైతులు తమ తమ ఫార్మర్ కార్డును పొందగలరని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట వేములపల్లి ఏఈఓ నితిన్ తదితరులు పాల్గొన్నారు.