మిర్యాలగూడ తహసిల్దారుగా సంతోష్ కిరణ్

మిర్యాలగూడ తహసిల్దారుగా సంతోష్ కిరణ్
మిర్యాలగూడ మే 3 అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ తహసిల్దారుగా సంతోష్ కిరణ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయనను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ నెల ఒకటిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటివరకు తహసిల్దారుగా పనిచేసిన ఎన్.హరిబాబు నల్గొండకు బదిలీ చేయగా ఆయన స్థానంలో దేవరకొండలో పనిచేస్తున్న సంతోష్ కిరణ్ ను మిర్యాలగూడకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మర్యాదపూర్వకంగా నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ ను కలిసి ఆశీస్సు పొందారు. తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు డిప్యూటీ తహశీల్దార్లు ప్రవీణ్ కుమార్, రజినీకాంత్, సీనియర్ అసిస్టెంట్ ఎంఏ.మతీన్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు టి. రామకృష్ణ, సత్యనారాయణ, జెఎ అశోక్, కంప్యూటర్ ఆపరేటర్ సత్యలు స్వాగతం పలికారు. మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking