హరిత విప్లవానికి…ప్రాణ గండం

హరిత విప్లవం నేడు ప్రాణగండంగా  పరిణమించిందని పర్యావరణ ప్రేమికుడు,  ప్రకృతి కవి జయరాజు అన్నారు. ఆదివారం ప్రకృతి – ఆరోగ్య రాష్ట్ర మహాసభను ఉద్దేశించి ప్రకృతికవి జయరాజు మాట్లాడుతూ *అడవిని అంటిపెట్టుకుని, అడవిని పరిరక్షిస్తున్న ప్రకృతి ప్రేమికులైన ఆదివాసుల హననం దారుణం. ప్రాచీన కాలం నుండి వారసత్వంగా వస్తున్న ప్రకృతి వైవిధ్యాన్ని, వైద్యాన్ని అభివృద్ధి చేసుకుందాం. అడవులను, ఆదివాసులను కాపాడుకుందాం.

ఆకలి సమస్య పరిష్కారానికి వచ్చిన హరిత విప్లవం నేడు ప్రాణగండంగా మారింది. ఆహారంలోకి పరోక్షంగా పంపబడిన విషం సమాజాన్ని అనారోగ్యపాలు చేసింది. ఈ అనారోగ్య సమస్యను సొమ్ము చేసుకుంటూ మెడికల్ మాఫియా విలయతాండవం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రకృతే వైద్యుడు- ఆహారమే ఔషధం అని సూత్రంగా పనిచేస్తూ, ప్రాచీన ఆయుర్వేద ఆరోగ్య ధర్మాలను ప్రచారం చేస్తూ, సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం పనిచేస్తుంది. 40 రోజులుగా ఆహార దీక్షల ముగింపు సందర్భంగా *ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలోని ఈసీఈ ఆడిటోరియంలో ప్రకృతి ఆరోగ్య మహాసభను* నిర్వహించారు.

 

*సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు, ప్రకృతి వైద్యులు టి.వెంకన్న* అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన *ప్రకృతికవి జయరాజు మాట్లాడుతూ* సహజసిద్ధమైన, స్థిరమైన ఆరోగ్యానికి ప్రకృతి ఔషధాలు ముఖ్యమైనవి. ఆ ఔషధాలను అందించే అడవి అత్యంత ముఖ్యమైనది. ఆ అడవులను, ఆదివాసులను కాపాడుకోవాల్సిన పరిస్థితులలో ఈ ప్రకృతి ఆరోగ్య రాష్ట్ర మహాసభ జరపడం ప్రత్యేకమైన అంశమని వివరించారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతిని పరిరక్షించే ఉద్యమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సామాజిక మనుగడకు ప్రధాన ఆధారమైన ప్రకృతి వనరులను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనిక ఎరువులను వినియోగించడం వల్ల భూమి సారవంతమైన జీవాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యంగా ఉంటేనే మనం, మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం లభించడం లేదన్నారు. ఈ ఈ పరిస్థితులు భవిష్యత్తు తరానికి మరింత ప్రమాదకరంగా తయారు కాబోతున్నాయని తెలియజేశారు. అడవులన్నీ పెట్టుబడిదారులకు దారా తత్త్వం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితం ప్రకృతి వెలిగించిన ప్రాణం లాంటిదని పేర్కొన్నారు.

*జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య* మాట్లాడుతూ ప్రకృతి జీవన విధానం ప్రకృతి వైద్యం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రముఖ పర్యావరణవేత్త, *అడవి సృష్టికర్త జడ్చర్ల సత్యనారాయణ* మాట్లాడుతూ అడవులకు మనసే ప్రమాదకరంగా మారుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. *ఆదర్శ రైతు లావణ్య రెడ్డి* మాట్లాడుతూ మనిషి ప్రస్తుత ఆధునిక కాలంలో వినియోగిస్తున్న పద్ధతుల ద్వారా ప్రతిరోజు 25 గ్రాముల కెమికల్ ను తన శరీరంలోకి పంపుతున్నాడని వివరించారు. వ్యవసాయాన్ని రసాయనిక విలువలు ద్వారా నిర్వహించడం వలన భూమిలోని సూక్ష్మజీవులు నశిస్తున్నాయని తెలియజేశారు. భూమి ఆరోగ్యంగా ఉండాలని, భూమిలో పండే పంట ఆరోగ్యంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తాను 30 రకాల పంటలను పండిస్తున్నట్లు తెలిపారు.

ప్రముఖ *హిప్నాటిస్టు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్* మాట్లాడుతూ మనం ప్రతిరోజు అనేక విధాలుగా ప్రకృతిని నాశనం చేస్తున్నప్పటికీ ప్రకృతి మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉందని అన్నారు.

కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి *వైద్య నిపుణులు డాక్టర్ పిసివి స్వామి, డాక్టర్ సుగుణ రావు, డాక్టర్ ఎల్ వెంకన్న, డాక్టర్ ఆరూర్ సుధాకర్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణవేత్త పద్మా రెడ్డి,* ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల *వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ దుబ్బ రంజిత్, ఉద్యమకారులు జాల లింగయ్య, ప్రజా కవి కళాకారుడు అర్జున్ రావు, జన సమితి నేత ఎం నరసయ్య,* మాట్లాడుతూ అమ్మ, అడవి, ప్రకృతికి విడదీయలేని సంబంధం ఉందన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఆరోగ్యాన్ని కార్పొరేటర్ సంస్థలు వ్యాపారమయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking